రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు – హరీష్ రావు…
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది..
రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగింది
ఒక గుంట కాని, ఒక ఎకరా కాని ఇరిగేషన్ భూమి కాని, ప్రభుత్వ భూమి కాని తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు.. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను
నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం.
రేవంత్ నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదు.. BRS పార్టీ తరపున, రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం