రైల్వే లైన్ వెనుక ప్రీ ప్లాన్…?
2014 నుంచి 2019 వరకు ఏపీ విషయంలో కేంద్రం తీరును, 2024 జూన్ నుంచి కేంద్రం తీరును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో సిఎం హోదాలో చంద్రబాబు ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్ళినా కనీసం కలవడానికి ఇష్టపడని ప్రధాని… ఇప్పుడు చంద్రబాబు కనపడితే చాలు… ఆయన ముఖంలో మనస్పూర్తిగా ఓ నవ్వు… మీకు ఏమైనా కావాలా బాబు గారు అనే ఓ భరోసా మాట… కుశల ప్రశ్నలు ఎక్కువయ్యాయి. హర్యానా సీఎం ప్రమాణ స్వీకారానికి అతిధిగా చంద్రబాబు వెళ్ళినా ఇదే సీన్.
కారణం ఎన్డియేలో టీడీపీ కీలక పార్టీ. 16 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చేతిలో ఉండటమే. ఎస్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం అంటారు పరిశీలకులు. మోడీ ఏం చేసినా పక్కా లెక్క ఉంటుంది అనేది ముందు నుంచి ఓ క్లారిటీ ఉంది. ఇప్పుడు మోడీ సర్కార్ ఏపీ విషయంలో చూపిస్తున్న ప్రేమ వెనుక కూడా ఓ లెక్క ఉంది. కేంద్ర బడ్జెట్ లో నిధులు అయినా, పోలవరం ప్రాజెక్ట్ అయినా… ఆ తర్వాత మీడియా సమావేశాల్లో తెలుగులో ఆర్ధిక మంత్రి వివరణ అయినా… బెజవాడ వరదలు అయినా… తెలంగాణా నుంచి వచ్చే బకాయిలు అయినా… ఇలా ఏ ఒక్కటి బ్రేక్ పడటం లేదు.
చంద్రబాబు ఇలా రావాలి అని ఓ నివేదిక పెట్టడం ఆలస్యం… నిధులు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి మీదుగా ఓ రైల్వే లైన్ ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇది రాజధాని అమరావతికి కచ్చితంగా బూస్ట్ ఇచ్చే న్యూస్. 57 కిలోమీటర్లు మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం ఉంటుంది. ఇక ఇదే సమయంలో బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలపడం ఓ సంచలనం.
అసలు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద మనసు అంటే… బీజేపికి రాబోయేది గడ్డు కాలమే. హర్యానా ఎన్నికల్లో ఏదో బీజేపి గెలిచినా రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపి గెలవడం అంత ఈజీ కాదు. త్వరలోనే మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇక తమిళనాడు, కేరళ ఎన్నికలు కూడా క్రమంగా ముంచుకు వస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికలకు కూడా ఎంతో సమయం లేదు. ఈ రాష్ట్రాల్లో బిజెపికి గడ్డు కాలమే అని, బీజేపి టైటానిక్ షిప్ అని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోతే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోయే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు అవకాశాల కాచుకుని కూర్చుంది. బీహార్ సిఎం నితీష్ ముందు బిగ్ ఆఫర్ రెడీగా ఉంచింది. చిరాగ్ పాశ్వాన్ ను కూడా నమ్మే ఛాన్స్ లేదు. చంద్రబాబు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా… ఈసారి బిజేపిని ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే బిజెపి ఇప్పుడు చంద్రబాబు అడిగే అభివృద్ధికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది.