ముందస్తు జమిలీ వస్తుందని వైసీపీ ప్రచారం
కొద్దిరోజుగా వైసీపీ నేతలు ముందస్తు జమిలీ జపం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు విపత్తులు వచ్చినా తన నియోజకవర్గం నుంచి వచ్చి పార్టీ ఆఫీసులో లేదా సెక్రటేరియట్ ప్రెస్ మీట్ పెట్టే స్వేచ్చ లేని కాకాణి గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి తన కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం ఏ పార్టీలోకి వెళ్లాలా అని ఫ్యామిలీ మీటింగులలో మేథోమథనం జరిపే బొత్స వరకూ అదే చెబుతున్నారు. జగన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వాక్కు కాబట్టి అందరూ అలా గుడ్డిగా ఫాలో కావాల్సిందే. లాజిక్కులతో
జమిలీ ఎన్నికలు ఓకే..కానీ ముందస్తు ఎలా ?
కేంద్రం జమిలీ ఎన్నికలపై పట్టుదలగా ఉంది. కానీ ముందస్తు అని చెప్పిందా ..కనీసం ఆ సూచనలు ఇచ్చిందా అంటే లేనే లేదని చెప్పుకోవాలి., ఎలా చూసినా అవకాశం లేదు. ఎందుకంటే జమిలీకి లోక్ సభ ఎన్నికలు జరిగే సమయమే కరెక్ట్. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. నాలుగు నెలల ముందుగా ఐదు రాష్ట్రాలు.. ఆ తరవాత నాలుగు నెలల వ్యవధిలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే ఇక్కడే సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఇక మిగిలిన రాష్ట్రాలను ముందుకు వెనక్కి జరపడం కష్టమా… లోక్ సభ పదవీ కాలాన్ని తగ్గించడం సులువా ?.
ఏపీలో ఎప్పుడైనా జమిలీనే జరుగుతాయి – కొత్తేముంది ?
నిజానికి ఏపీలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. గత ఎన్నికల్లోనూ జమిలీ ఎన్నికలే జరిగాయి. కానీ వైసీపీ పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది. ముందస్తు జమిలీ పేరుతో తనకు మరో సారి ఆడే అవకాశం వస్తే బాగుండని జగన్ ఆశపడుతున్నారు. నిజంగా ప్లేయర్ అయితే డక్ అవుట్ ఎదుకయ్యాడో ఆలోచించుకుని మళ్లీ అవకాశం వచ్చినప్పుడు తాను అనుకునే ఆటను ఆడేందుకు కసరత్తులు ప్రారంభిస్తాడు. అలా చేయనోడికి ఎన్ని చాన్సులు వచ్చినా డకౌటే అవుతారు.