Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 22, 2024

జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చేసింది..

హైదరాబాద్, అక్టోబర్ 24: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్‌గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్.

జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. బాధిత యువతి పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

జానీ మాస్టర్‌పై చర్యలు..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్న ఆయన్ను జనసేన అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మా అసోసియేషన్ సైతం ఆయనపై సస్పెన్షన్ విధించింది. అటు పోలీసు కేసులు.. ఇటు జనసేన, మా అసోసియేషన్ చర్యలతో జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది.

జాతీయ అవార్డు వెనక్కి..

తొలుత జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును ప్రకటించారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ అవార్డును వెనక్కి తీసుకుంటున్నారు. అవార్డును ఆయనకు ఇవ్వడం లేదంటూ ప్రకటించారు. అయితే, ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమం ఉందనే కారణంగానే జానీ మాస్టర్‌కు అక్టోబర్ ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తరువాత గడువు ముగియడంతో.. మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. తాజాగా హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది

Read Previous

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్..

Read Next

ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Leave a Reply

Most Popular