‘కల్కి’లో అందరికంటే ఎత్తుగా అమితాబ్.. ఎందుకంటే?
ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా ట్రైలర్లో అశ్వత్థామ పాత్రలో నటించిన బిగ్ బీ అమితాబ్ అందరి దృష్టినీ ఆకర్షించారు.
ట్రైలర్లో భైరవ, అశ్వత్థామతో తలపడే సీన్ లో ప్రభాస్ బిగ్ బీ ముందు చిన్నగా కనిపించారు.
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన ద్వాపర యుగానికి చెందిన అశ్వత్థామ 9 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటాడు.
ప్రతి ఒక్క విషయాన్ని పర్ఫెక్ట్ చిత్రీకరించడంపై మేకర్స్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.