తాడేపల్లి: కౌంటింగ్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్దులు, పార్లమెంట్ అభ్యర్దులు, చీఫ్ ఎలక్షన్ ఏజంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
- – ప్రజల ఆదరాభిమానాలతో వైయస్ఆర్‌సీపీ తిరిగి విజయం సాధించబోతోంది.
- – ఇది గ్రహించి అందరూ మరింత అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- – అభ్యర్దులకు ఏమైనా గైడెన్స్ అవసరమైతే వారు సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
- – కౌంటింగ్ ఏజంట్లకు సంబంధించి లిస్ట్ 31 వతేదీ లోగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆలోగా వైయస్సార్ సిపికి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజంట్లుగా నియమించుకోవాలి.
- – వారికి కౌటింగ్ కు సంబంధించి నియమనిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుని అధికారులతో వాటిని విడమరచి చెప్పగలిగేలా ఉండేవారిని ఎంపిక చేసుకోవాలి.
- – తెలుగుదేశం పార్టీగాని,చంద్రబాబుగాని ఎన్నికల ప్రక్రియప్రారంభం అయినప్పటినుంచి వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ తనకు అనుకూలంగా అవకాశాలను మలుచుకుని విధంగా కుయుక్తులు పన్నుతున్ననేపధ్యంలో ఎన్నికల నియమనిభందనలను అనుసరించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది.
- – పోస్టల్ బ్యాలెట్ విషయంలోగాని…ఇతర అంశాలలో ఈసి గైడ్ లైన్స్ కు భిన్నంగా ఆదేశాలు కూడా ఇవ్వమని అడుగుతూ ఈసిని అప్రోచ్ అవుతున్నారు.ఎలాగూ ఓడిపోతున్నామని కావచ్చు టిడిపి వాళ్ళు కౌంటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
- – అవసరమైతే కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్దితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోంది.
- – పోలింగ్ సమయంలో మన పార్టీ కార్యకర్తలు,నేతలు చాలాబాగా చేయగలిగారు.అందుకే మనం విజయం సాధించబోతున్నాం.
- – కౌంటింగ్ అనేది సీరియస్ ఇష్యూగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
- – ప్రధానంగా కౌంటింగ్ ఏజంట్ల నియామకం ఈ రెండు రోజులలో పూర్తి చేయాలి.పక్కాగా అది జరిగిపోవాలి.
- – కౌంటింగ్ ప్రారంభసమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు….ఆ తర్వాత ఈవిఎంల లెక్కింపు…
- ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునేవరకు ప్రతి క్షణం,ప్రతినిముషం అప్రమత్తంగా ఉండాలి.
- – ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీరంతా తిరిగి విజయం సాదించాలని కోరుకుంటున్నారో…ఎంఎల్ఏ అభ్యర్ది ఎంత గట్టిగా ఉంటారో… మీరు నియమించిన ఏజంట్లు ప్రతి టేబుల్ దగ్గరా అంతగట్టిగా ఉండాలి.
- – అలాంటి వ్యక్తులనే కౌంటింగ్ ఏజంట్లుగా నియమించుకోవాలి.
- – మీకు కావాల్సిన గైడ్ లైన్స్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇవ్వబడుతుంది.సందేహాలు కూడా తీర్చుకోవచ్చు.
- – ఈనెల 29 వతేదీకల్లా కౌంటింగ్ ఏజంట్ల ఫార్మాట్ లో ఉన్నవిధంగా పేర్లు,ఫోన్ నెంబర్ తదితర వివరాలుపూర్తి చేసి పంపాలి.
- – ఆర్ ఓలను కలుసుకుని మన ఏజంట్లు ఎక్కడెక్కడ కూర్చోవాల్సి ఉంటుంది.అది ముందుగా తెలుసుకోవాలి.
- – ఎన్నికల కమీషన్ కు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఈసికి ఫిర్యాదు చేయడం జరిగింది.దాని ప్రకారం ఆదేశాలు తెలుసుకోవాలి.
- – పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. నియమనిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
- – పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చింది.అది అందరూ గుర్తుంచుకోవాలి.
- – వైయస్ జగన్ పారదర్శకమైన పాలన తిరిగి మన పార్టీని గెలిపించబోతోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు