Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

వివాదంలో జయ జయహే తెలంగాణ గీతం

హైదరాబాద్:మే 29 :: తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ… రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఉత్సవాలకు రేవంత్‌ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమర వీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి.. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు.

రాష్ట్ర ప్రత్యేక గీతంతో పాటు అధికారిక నూతన చిహ్నాన్ని ఆవిష్కరించ నున్నారు. ప్రముఖ తెలం గాణ కవి అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణ గీతాన్నీ మళ్లీ కంపోజ్ చేయించడం, అందులో కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ సినీ మ్యూజిషి యన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

జ‌య‌జ‌య‌హే తెలంగాణ‌ పాట‌ను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకు లు ఎవరు లేరా? అని ప్రశ్నిస్తోంది. ఈపాట తెలం గాణ ఆత్మగౌర‌వమన్న TCMA.. కీర‌వాణి మ్యూజి క్ చేయ‌డం తమతో పాటు తెలంగాణ ప్రజలను అవ‌మాన ప‌ర్చడ‌మేనని తెలిపారు.

మరోవైపు తెలంగాణ గీతా నికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై BRS నేత RS ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం తెలిపారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచాక.. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిం దని RS ప్రవీణ్‌ ట్వీట్ చేశారు.

తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన.. కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో స్పందిం చారు. రాష్ట్ర గీత రూప కల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు. అందె శ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తార నేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్‌ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు..

Read Previous

కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Read Next

కేసీఆర్ అరెస్ట్ అవుతారా?

Leave a Reply

Most Popular