Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ

బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.  ప్రజ్వల్‌ తరఫు న్యాయవాది అరుణ్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. మరోవైపు, మ్యూనిచ్‌ నుంచి  ప్రజ్వల్‌ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 31న ఆయన బెంగళూరులో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే పడింది.  విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని.. మే 31న ఉదయం 10 గంటలకు సిట్‌ ఎదుట హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ  సోమవారం విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. 
మరోవైపు, తనపై నమోదైన కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్‌ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్‌పై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్‌.డి.రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భవానీకి ముందస్తు బెయిల్‌పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.

Read Previous

కేసీఆర్ అరెస్ట్ అవుతారా?

Read Next

గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా

Leave a Reply

Most Popular