హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
నేరుగా వాహనదారుల నుండి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. ఈక్రమంలోనే పలువురి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.