త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో.. పలు రాష్టాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. తెలంగాణ సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే చాన్సుంది.
పీఎఫ్ఎస్ గా కొనసాగడానికి రామకృష్ణారావు విముఖత చూపించినట్టు సమాచారం. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో సమర్ధుడైన అధికారి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. అటు పోలీస్ శాఖలో సైతం సీనియర్ ఐపీఎస్ లపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. ప్రభుత్వంలోకి మళ్ళీ వికాస్ రాజ్ వచ్చే చాన్సుంది. సచివాలయంలో కీలక బాధ్యతలు ఇస్తారని సమాచారం. దీనిపై కసరత్తు కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్.