తుపాన్, వాయుగుండం, అల్పపీడనాలు ఏర్పడటం వల్ల ఈ సారి ముందే వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు కూడా ముందుగానే రావడంతో వానలు ముందే పడనున్నాయి.
చినుకు పడితే హైదరాబాద్ నగరం చిత్తడి అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ సారి అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పోలీసు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. వానాకాలం వస్తోన్న క్రమంలో సిటీలో ఇబ్బంది ఎదుర్కొనే ప్రాంతాల గురించి చర్చించారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న చోట ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? జనం ఇబ్బంది పడకుండా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావారణ శాఖ అధికారుల నుంచి పలు ప్రతిపాదనలను తీసుకున్నట్టు సమాచారం. సలహాలు, సూచనలు తీసుకొని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది