Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి: హరీష్ రావు

కిరీటి న్యూస్:: హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా కోల్పోతారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారు. దీంతోపాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు అని హరీశ్‌రావు వెల్లడించారు.

520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది

ఎంబీబీఎస్/పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది. ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుండి కన్వీనర్ కోటాలో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసులుబాటు కల్పించారు. ఇదే విధానం కొనసాగితే, 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని నివారించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దీనికోసం ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్/డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించాయి. అయితే ప్రస్తుతం జూన్ 2తో విభజన చట్టానికి కాలం చెల్లుతుందటంతో పాత మెడికల్ కాలేజీలోని 100 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్‌రావు.

ఎంబీబీఎస్ సీట్లు 8340..

తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. ఎంబీబీఎస్, పీజీ సహా ఇతర వైద్య విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ బిడ్డలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే, స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి. కన్వీనర్ కోటాలోని 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డాక్టర్ కావాలనుకునే వైద్య విద్యార్థుల అవకాశాలు మెరుగుపరచాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Read Previous

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం..

Read Next

యాదగిరి కొండపైన భక్తుల రద్దీ

Leave a Reply

Most Popular