సినిమా స్టైల్లో హైవేపై దోపిడీ
వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయడం, అంతే స్పీడ్గా మరొక వెహికల్లోకి జంప్ కావడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై హైవేపై జరిగింది. దుస్తుల లోడ్తో వెళ్తున్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. ఓ పెద్ద ప్యాకెట్ను రోడ్డుపైకి విసిరేశారు. ఆ వెనకాలే మరో దొంగ బైక్లో వస్తుండగా, అందులోకి లారీ నుంచి ఎంతో చాకచక్యంగా ఇద్దరు దిగేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.