కిరీటి న్యూస్:: కాంగ్రెస్, బీజేపీలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి విషయంలో తెలంగాణ కంటే… దేశంలో ఏదైనా మెరుగైన రాష్ట్రం ఉందా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ కంటే ఏ..రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే రేపు ఇదే టైంకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామన్న కేటీఆర్.. కాంగ్రెస్ వచ్చాక 32 వేలు ఉద్యోగాలిచ్చామని అబద్ధాలు చెబుతోందన్నారు.