Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

ఘోర ప్రమాదం.. సింగపూర్ విమానంలో భయానక పరిస్థితి. 5 నిమిషాలలో 6వేల అడుగుల కిందకు

లండన్ నుంచి సింగపూర్కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి వస్తువులు జారి పడుతున్నాయి.. సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరి పడుతున్నారు.. ఆకాశం నుంచి ఒక్క ఉదుటన దూకేసినట్లుగా ఉంది పరిస్థితి. ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానమంతా చిం వందర.. రక్తపు మరకలు.. ఇదీ సింగపూర్ ఎయిర్లైన్స్, చెందిన విమానంలో నెలకొన్న పరిస్థితి.

సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్కు బయల్దేరింది. మార్గమధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు దిగిందని ఫ్లైట్ రాడార్ 24 డేటాను బట్టి తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. విమానంలోని ఓవర్ హెడ్ బిన్స్, దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్, ఫ్యాన్ ప్యానెల్స్ సీలింగ్కు వేలాడుతూ కనిపించాయి. ఇలాంటి సమయాల్లో సీటు బెల్టులు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని, అందుకే ప్రయాణికులకు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్టును ఎల్లవేళలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్కు పంపుతున్నట్లు తెలిపింది.

Read Previous

హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై ధ్వజమెత్తిన ఓ మహిళ

Read Next

నా పేరు బయటికొస్తే సూసైడ్ చేసుకుంటా .. హేమ పోలీసులనే బెదిరించిందా ..?

Leave a Reply

Most Popular