రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి
• నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా మంచినీరందించండి
• జల్ జీవన్ మిషన్ కింద ఈనెల 13 తర్వాత సిఇఓ అనుమతితో పనులు చేపట్టండి
• ఈనెల 2న 28 లక్షల 56 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరు
• షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం- పెద్దఎత్తున పనులు చేపటండి
చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి,3 మే:రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యులు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.తాగునీరు,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా మంచినీటి సరఫరా చేయాలని స్ఫష్టం చేశారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.రక్షిత మంచినీటి సరఫరా పధకాల నిర్వహణ,తాగునీటి అవసరాలకు ఇటీవల కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా ఎన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపింది అధికారులతో సమీక్షించారు.జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా నీటి ఎద్దడి అధికంగా గల ఆవాసాలకు ట్యాంకులు ద్వరా నీటిని అందించాలని ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితులపైన ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించారు.భూగర్భ జల మట్టాల స్థాయి ఏవిధంగా ఉంది ఆశాఖ అధికారులను వివరాలు అడిగి తెల్సుకుని ఎప్పటికప్పుడు భూగర్భ జల మట్టాలను అంచనా వేయాలని ఆదేశించారు.
జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన పనులను ఈనెల 13వ తేదీన ఎన్నికలు అయ్యాక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదంతో పనులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పిఆర్ అండ్ ఆర్డి అధికారులకు స్పష్టం చేశారు.మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ షెల్ప్ ఆఫ్ ప్రాజెక్టులకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపినందున వేగంగా పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.రాష్ట్రంలో గురువారం 28లక్షల 56 వేల మంది ఉపాధి పనులు నిర్వహించారని పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సిఎస్ కు వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర జలవనరులు,పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది గల 281 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకులు ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.మొత్తం 3 వేల 75 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకులు ద్వారా సరఫరాకు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు.కరువు ప్రభావిత మండలాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు 39 కోట్ల రూపాయలకు ఎన్నికల సంఘం ఆమోదించిందని తెలిపారు.తాగునీటి అవసరాలకై సమ్మర్ స్టోరేజి ట్యాంకులను నీటితో నింపేందుకు ప్రకాశం బ్యారేజి,నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ఈనెల 1వ తేదీ వరకూ నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు.ఉపాధి హామీ పనుల ప్రగతిని వివరిస్తూ గురువారం రాష్ట్రంలో 28లక్షల 56 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహించారని తెలిపారు.
ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు.ఇంకా ఈసమావేశంలో ఆర్డబ్ల్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి రెడ్డి,పబ్లిక్ హెల్తు అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇఎన్సి ఆనందరావు, ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్ చిన తాతయ్య,జెడి ఎంఏయుడి ఎస్.రవీంద్ర,భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్యరాజ్,ఎడి విశ్వేశ్వరరావు,తదితర అధికారులు పాల్గొన్నారు.
- Home
- Andhra Pradesh
- రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి-చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడండి-చీఫ్ సెక్రటరి డా.కెఎస్.జవహర్ రెడ్డి
- Kiriti
- May 3, 2024
- No Comments
- 2
- 1 minute read
The Latest News
- ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ November 21, 2024
- పోలీసు పహారాలో మహబూబాబాద్ జిల్లా November 21, 2024
- రెడ్ హ్యాండుగా పట్టుబడ్డ ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ November 21, 2024
- ఉరి వేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ November 21, 2024
- హైదరాబాద్‌లో మరో దారుణ హత్య November 21, 2024
- రేవంత్ నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదు. – హరీష్ రావు… November 21, 2024
- సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ November 21, 2024
- రాజంపేట సమీపంలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు November 21, 2024
- 12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర November 6, 2024
- అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..! November 6, 2024
- అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు November 6, 2024
- ఆట ముగియగానే ప్రాక్టీస్‌కు వచ్చిన కోహ్లీ.. స్టేడియంలో సందడి, అలాగే ఉండిపోయిన ఫ్యాన్స్! October 25, 2024
- సరైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ నియంత్రణ సాధ్యమే: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య October 25, 2024
- హ్యాపీ ‘కోడి కత్తి డే’ జగన్.. టీడీపీ సెటైరికల్ ట్వీట్.. October 25, 2024
- రైల్వే లైన్ వెనుక ప్రీ ప్లాన్…? October 25, 2024
- వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు October 25, 2024
- గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక October 25, 2024
- భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. October 25, 2024
- జమిలీ ఎన్నికలు ఓకే..కానీ ముందస్తు ఎలా ? October 24, 2024
- టీడీపీ, వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో పోస్టులు: ఏం బయటపెడతారు? October 24, 2024

Categories
- Science14
Categories
- Andhra Pradesh (143)
- Arts (8)
- Blog (13)
- Business (7)
- Cinema (28)
- City (4)
- Crime (37)
- Crypto (1)
- Litecoin (1)
- Culture (20)
- Editorial (18)
- Entertainment (8)
- Food (5)
- General (55)
- Health (13)
- Hyderabad (9)
- International (22)
- Lifestyle (51)
- Long Title Post (6)
- N.Y. (1)
- National (61)
- Opinion (3)
- Personal Blog (8)
- Fashion (8)
- Politics (143)
- Science (14)
- Stories (1)
- Technology (3)
- Telangana (110)
- Town (1)
- U.S. (1)
- Video (18)
- World (6)