రాష్ట్రపతి భవన్కు బాంబు బెదిరింపు
రాష్ట్రపతి భవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాష్ట్రపతి భవన్లో బాంబు పెట్టామని, 15 నిమిషాల్లో పేలుతుందని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకుని ప్రశ్నించగా.. తాను వృత్తి రీత్యా కూలీ అని, మద్యం మత్తులో పోలీసులకు ఫోన్ చేశానని ఒప్పుకున్నాడు.