రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ పరిశీలించండి : జిల్లా కలెక్టర్
తిరుపతి, అక్టోబర్ 27: ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ -2024 నేడు ప్రచురించాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు తిరుపతి జిల్లాలో 17,61,328 ఓటర్లు వున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో విడుదల చేసారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ -2024 మేరకు ఇప్పటికే 11 సార్లు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి ప్రక్రియ వివరించామని నేడు ముసాయిదా ప్రకటన జరుపుతున్నామని అన్నారు. ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ -2024 మేరకు పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితా 2024 జనవరి 5 న ప్రకటించడం జరుగుతుందని, నేటి నుండే దరఖాస్తులు తీసుకోవడం, ఇ ఆర్ ఓ నెట్ క్లోజ్ అయ్యే సమయానికి వున్న పెండింగ్ దరఖాస్తులు పూర్తి స్థాయిలో పరిశీలించి అప్ లోడ్ చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే ప్రత్యేక డ్రైవ్ నవంబర్ 4,5 , డిసెంబర్ 2,3 తేదిల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో బి ఎల్ ఓ లు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటలవరకు అందుబాటులో ఉంటారని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాకు అందిన ఓటింగ్ యంత్రాల ఎఫ్.ఎల్.సి. ప్రక్రియ నవంబర్ 10 వరకు జరుగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పక హాజరు అయి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. అలాగే రెగ్యులర్ గా హజరవుతున్న ప్రతినిధులు ఎఫ్ ఎల్ సి ప్రక్రియ ను సమావేశంలో వివరిస్తూ జిల్లా కలెక్టర్ చేపట్టిన ఏర్పాట్లు, పరిశీలనకు వచ్చిన ప్రత్యేక ఎన్నికల అధికారులు ప్రసంచిన విధానం వివరించారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ పెంచల కిషోర్ , ఆర్డిఓ లు తిరుపతి –నిశాంత్ రెడ్డి , శ్రీకాళహస్తి – రవిశంకర్ రెడ్డి, సూళ్ళూరు పేట- చంద్రముని ,స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు , రాజకీయ పార్టీల ప్రతినిధులు అం ఆద్మీ – నగేష్ , బి జే పి – వరప్రసాద్ , తెలుగుదేశం – మనోహరాచారి , పురుషోత్తం , కాంగ్రెస్ – చిరంజీవి, వై ఆర్ సి పి – చంద్రమోహన్ , ఎన్నికల సూపరిన్ టెన్ డెంట్ సురేష్ , తహసిల్దార్లు ,ఇడిటిలు పాల్గొన్నారు.