తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఒకరు.. తరచూ ఏదో ఒక విషయం పైన పలు రకాలుగా ట్విట్ చేస్తూ పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటారు.
కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలోనే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా తలదురుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వర్మ.. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ఇట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఒకరకంగా చెప్పాలి అంటే వర్మ దర్శకుడుగా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే మరింత హైలెట్ అయ్యారని చెప్పవచ్చు.. ట్విట్టర్ వేదికగా టిడిపి,జనసేన రాజకీయ నాయకులతో పెద్దవార్ చేస్తూ ఉంటారు. అందుకే వర్మ పైన కూడా పలు రకాల తీవ్రమైన విమర్శలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వర్మ ట్విట్టర్ వేదికగా కొన్ని గంటల క్రితం ఒక పోస్ట్ చేయడం జరిగింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది.
ఆ జైలు ముందు నిలబడి ఒక సెల్ఫీ దిగుతూ ఒక పోస్ట్ చేశారు.. నేను బయట అతను లోపల అనే క్యాప్షన్ ఫోటోకు పెట్టి షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో పెట్టిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని జైల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా వర్మ గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది వర్మ కావాలని టిడిపి నేత చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే ట్విట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతున్నది