Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

మళ్లీ మొదటికొచ్చిన బతుకమ్మ చీరలు లొల్లి

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 08: తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ‍్మ చీరలపై ఆడపచుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు.. వాటిని తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు. నేతలు ఎంత బతిమాలినా లాభం లేకుండా పోతోంది. కనీసం తీసుకున్నట్టు ఫొటోకు ఫోజు ఇవ్వమని బతిమాలితే.. తీరా తీసుకుని వాటిని ఆ నేతల ముందే చింపేస్తూ, కాల్చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలోని తక్కలపల్లి గ్రామానికి చెందిన మహిళలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు.

కేసీఆర్ భార్య గానీ, కోడలు గానీ.. కూతురు కవిత గానీ ఈ చీరలు కట్టుకుంటారా?అంటూ నిలదీస్తున్నారు.
చేనేత చీరలను పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసిన ప్రభుత్వం.. తీరా డామేజీ చీరలను ఇచ్చిందని మండిపడుతున్నారు.

కేవలం వంద రూపాయల విలువ చేసే సాధారణ చీరలు పంపిణీ చేశారనీ అన్నారు. క్రైస్తవుల పండగల సమయంలో విందులు ఏర్పాటు చేసి బహుమతులు ఇస్తారని.. ముస్లింలకు ఇఫ్తార్ విందులు, బట్టలు, కుట్టుమిషన్లు ఇస్తారని.. మరి హిందువుల పండగలకు మాత్రం నామమాత్రంగా చీరలు ఇచ్చి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇదిలా ఉంటే.. కొత్తూరు మండలం ఎస్బీపల్లికి చెందిన మహిళలైతే.. బతుకమ్మ చీరలను తీసుకోడానికి కూడా నిరాకరించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద స్థానిక జడ్పీటీసీ తదితర నాయకులు గ్రామంలో ఉన్న మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.

కానీ చీరలు తీసుకోడానికి మహిళలు ముందుకు రాలేదు. చీరలు తీసుకుంటున్నట్లు కనీసం ఫొటో అయిన దిగాలని మహిళలను కొందరు బతిమాలారు. అయితే.. కొందరు మహిళలు తీసుకున్నా.. ఆ చీరలను చూసి నాసిరకంగా ఉన్నాయి అంటూ అక్కడే రోడ్డుపై పడేసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

Read Previous

ఎమ్మెల్యే కారు పై బాంబు దాడి

Read Next

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

Leave a Reply

Most Popular