హైదరాబాద్: భారాస, భాజపా రహస్య స్నేహాన్ని నిజామాబాద్‌లో ప్రధాని మోదీ బయటపెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ మాటల తర్వాత కూడా భారాసతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు..
గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.
”భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు కేసీఆర్‌కు డబ్బు పంపారని మోదీ ఆరోపించారు.. ఆ సమాచారం ఉంటే కేసీఆర్‌పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేసీఆర్ తన అక్రమ సంపాదనలో కొంత మోదీకి చెల్లిస్తున్నారు. భారాస అవినీతిలో భాజపాను ఆయన భాగస్వామిని చేశారు. భారాస, భాజపా అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్ బంధం. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఇప్పుడేం చెబుతారు?నీళ్లు అంటే కవిత కన్నీళ్లు.. నిధులు అంటే కాళేశ్వరం అవినీతి.. నియామకాలు అంటే కేటీఆర్‌కు సీఎం సీటు గుర్తొస్తాయి”అని రేవంత్ వ్యాఖ్యానించారు..