Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి నేపథ్యం ఇదే..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, జేడీ వాన్స్ ఎన్నిక కానున్నారు. ఈ జేడీ వాన్స్ మన ఆంధ్ర అల్లుడు. అతడి భార్య పేరు ఉషా చిలుకూరి. ఆమె అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది. ఉషా స్వస్థలం ఏపీకి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద వడ్లూరు అనే చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు.

ప్రేమ వివాహం..
ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో చదువుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు. చదువుకునే సమయంలోనే సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సులో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్ పై పనిచేశారు. ఉషా చిలుకూరి జేడీ వాన్స్ ను తొలిసారిగా 2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో కలిశారు. ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్ పై జరిగిన గ్రూప్ డిస్కషన్ లో ఉషా, వాన్స్ లు పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఉషా, జేడీ హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె మిరాబెల్, కుమారులు ఇవాన్, వివేక్.

50 సంవత్సరాల క్రితం..
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో అమెరికా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జెడి వాన్స్ విజయం కోసం ఆ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉషా వాన్స్ భర్త గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉషా వాన్స్ వడ్లూరుకు చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణం అంటున్నారు. వారు 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆ కుటుంబం గ్రామంలోని వ్యక్తులను విద్యావంతులను చేసిందన్నారు. గతంలో వారు గ్రామానికి భూమిని విరాళంగా ఇచ్చారని, ఆ విరాళంతోనే ఇక్కడ సాయిబాబా, లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవారి బాల సీతా దేవాలయాలు నిర్మించబడ్డాయన్నారు. ఊరి శ్రేయస్సు కోసం, ఉషావాన్స్ విజయం కోసం తాము ప్రత్యేక ప్రార్థనలు చేసామన్నారు.

Read Previous

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Read Next

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

Leave a Reply

Most Popular