హ్యాపీ ‘కోడి కత్తి డే’ జగన్.. టీడీపీ సెటైరికల్ ట్వీట్..
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేసింది. 2018లో విశాఖపట్నంలో జగన్‌పై కోడి కత్తితో దాడికి ఆరేళ్లు పూర్తయ్యాయని టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది.
“హ్యాపీ ‘కోడి కత్తి డే’ జగన్. ఆరేళ్ల క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్లడం కాదు. ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్” అని సెటైర్లు వేసింది. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.