Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

కిరీటి న్యూస్:: హైదరాబాద్: తెలంగాణ కొత్త లోగో (కొత్త రాజముద్ర) దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల మాటలు.. ఇక సోషల్ మీడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్- 2 రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్-02న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. తెలంగాణ గీతం మాత్రమే జూన్-02నే విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.

కొత్త లోగోలో ఏముంది..?

కాగా.. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచినట్లు కొన్ని చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ లోగోనే రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం 40కిపైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించగా.. ఒక్కటి మాత్రం ఫైనల్ చేసిందని టాక్. మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

Read Previous

కడప విమాన సర్వీసులు

Read Next

కర్రోడా అన్నందుకు విడాకులు..!

Leave a Reply

Most Popular