Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండటంతో ఊహించని రేంజ్‌లో నిర్వహణకు రెడీ అయింది.

ఈ ఆవిర్భావ సెలబ్రేషన్స్‌కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లలోనే సంప్రదింపులు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంగళవారం నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంతోషం వ్యక్తం అవుతున్నది.

పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని సీఎం రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని సీరియస్ అయ్యారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఏ ఒక్క నాయకుడి వల్ల రాష్ట్రం రాలేదని అన్నారు. మళ్ల ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్రా కలిసిపోతాయేమోనని భయం వేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Previous

నేడు BRS ఆందోళన

Read Next

పోలీసులపై ప్రముఖ హీరోయిన్ ఫైర్

Leave a Reply

Most Popular