జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుంది, పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి నుండి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి వరకు వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికారి సంస్థ గుంటూరు, చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్టిక్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ (పరిపాలన & విధానం) అథారిటీల ఏర్పాటు పనిచేయడం గురించి గుంటూరు ప్రధాన కేంద్రంగా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల అధికార పరిధిగా కాజా గ్రామం లోని లాస్య రెసిడెన్సి 2 లో 106 అండ్ 107 ప్లాట్ నెంబర్లలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అథారిటీ చైర్మన్ నిరంజన్ తెలిపారు చైర్మన్ తో సహా ముగ్గురు సభ్యులు ఉంటారని అన్నారు.పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి పై పై వచ్చే ఫిర్యాదులను జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుందని ఆ సంస్థ చైర్మన్, రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు. మంగళవారం కాజా లోని లాస్య రెసిడెన్సి ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్టిక్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ (పరిపాలన & విధానం) అథారిటీల ఏర్పాటు పనిచేయడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు ప్రధాన కేంద్రంగా గుంటూరు, పల్నాడు ,బాపట్ల ,ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల, అధికార పరిధిగా కాజా గ్రామం లోని లాస్య రెసిడెన్సి 2 లో 106 అండ్ 107 ప్లాట్ నెంబర్లలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అథారిటీ చైర్మన్ నిరంజన్ తెలిపారు చైర్మన్ తో సహా ముగ్గురు సభ్యులు ఉంటారని అన్నారు.ముఖ్యంగా పోలీస్ కస్టడీలో జరిగే మరణాలు, అత్యాచారాలు అదేవిధంగా పోలీస్ కస్టడీలో తీవ్రమైన గాయాలు, పోలీసులచే బలవంతపు వసూళ్లు, పోలీసులచే ఇండ్లు భూ ఆక్రమణలు, పోలీస్ అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం పరచటం లాంటి పై ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుందన్నారు. ఇది ఇలా ఉండగా అస్పష్టమైన ఆకాశరామన్న ఫిర్యాదులు మారుపేరుతో కూడిన వీలులేని చేతి వ్రాత అస్పష్టమైన ఫిర్యాదులు, సంఘటన జరిగి ఒక సంవత్సరం కాలం ముగిసిన తర్వాత నియమాలు కార్మికుల లేదా పారిశ్రామిక వివాదాలు పై ఫిర్యాదులు స్వీకరించడం జరగదని నిరంజన్ తెలిపారు.జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ అధికార పరిధి ( గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు) ఈ సమావేశంలో జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ సభ్యులు అడిషనల్ ఎస్పీ (రిటైర్డ్) కే రఘు, సి ఆర్ డి ఏ డిప్యూటీ డైరెక్టర్ (రిటైర్డ్) చెన్నకేశవులు పాల్గొన్నారు.