బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. ఓటమిని జీర్ణించుకోలేకనే నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.!
పట్టభద్రుల ఎన్నికల’లో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు.
శనివారం నాడు మేడిపల్లి పీఎస్’ లో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖిత పూర్వకంగా (S505(2), S66(C),66(D)IT Act) Cr.No 590/2024 ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పీఏ తో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మనో దైర్ఘ్యాన్ని దెబ్బ తీయడం ద్వారా తనను ఎదుర్కొలేరని బీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిక జారీచేశారు. కేటీ రామారావు నీతి మాలిన చర్యలను మాను కోవాలని సూచించారు.