కిరీటి న్యూస్:: దిల్లీ వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది… శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బేబీ కేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లు రాత్రి 11:30గంటలకు ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చిందని అధికారి రాజేశ్ తెలిపారు. ‘వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్నాం. దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. ఆస్పత్రితో పాటు పక్కనే ఉన్న మరో భవనం ధ్వంసమైంది. 12 మందిని రక్షించి వారిని ఆస్పత్రికి తరలించాం. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’ అని రాజేశ్ తెలిపారు.