కిరీటి న్యూస్:: భూపాలపల్లి జిల్లా:మే :24 -కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నిం చగా భూగ ర్భంలో శబ్దాలు వినిపించాయి.
దీంతో బ్యారేజీ పెను ప్రమా దానికి గురయ్యే అవకాశం ఉండటంతో పనులు నిలిపే శారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకుపో వడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం ఉంది….