ఈ ఉదయం యుఎఇ ప్రజలు భారీ వర్షం ఎదుర్కొన్నారు. భారీ వర్షం, తుఫాను కారణంగా చాలా మంది తమ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్కూల్ విద్యార్థులు కూడా ఈ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా వాహనాలు రహదారి మధ్యలో చిక్కుకున్నాయి.
సౌదీ అరేబియా, యుఏఈలో సాగుతున్న వాతావరణ విధ్వంసం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. గురువారం మళ్లీ భారీ వర్షం ప్రారంభమైన తర్వాత UAE అధికారులు దేశవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికే హెచ్చరిక జారీ ..
కొన్ని రోజుల క్రితం UAE వాతావరణం మరింత దిగజార్చుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మే 2వ తేదీ నుంచి నేడు అంటే మే 3వ తేదీ వరకు వాతావరణం మరింత దిగజారుతుందని అంచనా వేసింది. UAE ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో భద్రతా సలహాలను జారీ చేసింది. పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, కంపెనీలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచి పని చేసే విధంగా వర్క్ ఇవ్వాలని కోరింది. పార్కులు , బీచ్‌లు మూసివేశారు. బస్సు సర్వీసులు, విమానయాన సంస్థలు కూడా దెబ్బతిన్నాయి.