విజయవాడ: ఏపీలో జనసేన ( Janasena ) తో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది..
మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాలల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిష్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుకొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు..తెలంగాణాలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్లు కోసం కమ్యూనిష్టులు ఇలా మాట్లాడుతున్నారు” అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవ చేశారు..
జలజీవన్ మిషన్‌ను అమలు సరిగా జరగడం లేదు
”దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఈరోజు జరిగింది… మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగింది. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడాను. ఈ కమిటీలో కేంద్ర పథకాల అమలు గురించి చర్చించాం.. జలజీవన్ మిషన్ వంటివి అమలు సరిగా జరగడం లేదు. ఇళ్ల నిర్మాణం మూడు నెలల్లో పూర్తిచేయాలని చెప్పాను. NREGS నరేగా పథకం అమలుపై చర్చించాం. రైతుల బీమా చెల్లించలేదని అధికారులే చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చద్దని కోరాను. తూర్పు కాపులకు OBC రిజర్వేషన్ ఇవ్వాలని NCBC నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించాను. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని, కేంద్రం NCBC సమావేశం నిర్వహించింది” అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.