న్యూఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో పోలింగ్ (Polling) ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సమీక్ష (Review) చేయనుంది..
వీడియో కాన్ఫరెన్స్ (Video conference) ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (Deputy Election Commissioner) నితీశ్ వ్యాస్ (Nitish Vyas) ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఎఫ్ఐఆర్‌లు, ఓటరు సమాచార పత్రాలు, ఓటరు కార్డుల పంపిణీ స్థితిగతులపై సీఈసీ ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ.. తదితర అంశాలపై కూడా నితీశ్ వ్యాస్ చర్చించనున్నారు..