Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు..

ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, అర్భన్‌ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ బి సుబ్బారావు, టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్‌ ఎండీ బి రాజశేఖర రెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు..

సీఎం ఆదేశాలు ఇవే..
►వర్షాకాలం ముగిసి పనుల సీజన్‌ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి.
►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి.
​​​​​​​►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.
​​​​​​​►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్‌ చేసి వినియోగించేలా చూడాలి.
​​​​​​​►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
​​​​​​​►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
​​​​​​​►ముడసర్లోవ పార్క్‌ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో కమర్షియల్‌ కాంప్లెక్స్, మల్టీ లెవల్‌ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.
​​​​​​​►విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి.
​​​​​​​►కన్వెన్షన్‌ సెంటర్‌, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి.

​​​​​►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
​​​​​​​►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి.
​​​​​​​►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి.

Read Previous

AP draft voters list: ఏపీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల..

Read Next

Onion price: సామాన్యులపై మరో పిడుగు.. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు..

Leave a Reply

Most Popular