సూర్యాపేట జిల్లాలో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని అన్నారు. డిసెంబర్ 3 తరువాత కేసీఆర్ ఆర్ఎస్, సోనియా గాంధీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాయి..
రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి సోనియా.. కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ లక్ష్యం పేదరిక నిర్మూలన చేస్తుంది.. కేసీఆర్ లక్ష్యం కుటుంబ సభ్యుల అస్తులు పెంచుకోవడమే.. బీఆర్ఎస్ పేదల, దళిత, బీసీల వ్యతిరేక పార్టీ.. ఇప్పటికైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా కేసిఆర్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు..
దళితులకు 3 ఎకరాల పథకం ఎటుపోయెంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల సంక్షేమం గాలికి వదిలేశారు.. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్, కృష్ణ వాటర్ రివర్ బోర్డ్ ఏర్పాటు చేశాం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం.. ప్రధాని హోదాలో మోడీ మొదటి పూజ చేయబోతున్నారు అని ఆయన తెలిపారు. మా అభ్యర్ధులను భారీ మెజార్టితో గెలిపించండి అని అమిత్ షా కోరారు..