హైదరాబాద్, అక్టోబర్ 12 : హైదరాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.
వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, “రి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ.మురళీధర్, నిజామాబాద్ సీపీగా ఎస్.జయరాంను నియమించారు.