Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

ISRO: ‘ఆదిత్య ఎల్‌1’ మార్గాన్ని సరిదిద్ది..! ఇస్రో కీలక విన్యాసం

బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య- ఎల్‌1 (Aditya-L1)’ ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణిస్తోంది. ఇప్పటికే భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది..

ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని (Trajectory Correction Maneuvre) విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వెల్లడించింది. లగ్రాంజ్‌ పాయింట్‌-1 (L1) దిశగా దూసుకెళ్తోన్న వ్యౌమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు టీసీఎం దోహదపడుతుంది. అక్టోబరు 6వ తేదీన 16 సెకన్లపాటు ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు ఇస్రో తెలిపింది..

అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు.. సెప్టెంబరు 19న ట్రాన్స్- లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) విన్యాసాన్ని నిర్వహించి.. ఆదిత్య ఉపగ్రహాన్ని ‘ఎల్‌ 1’ వద్దకు చేర్చే మార్గంలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ విన్యాసాన్ని ట్రాక్‌ చేయగా.. ట్రాజెక్టరీని సరిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. దీనికోసం తాజా విన్యాసం అవసరమైందని చెప్పారు. ఆదిత్య ఎల్‌-1లోని వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నాయని, లగ్రాంజ్‌ పాయింట్‌-1 దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. మరికొన్ని రోజుల్లో మాగ్నెటోమీటర్ మళ్లీ ఆన్ చేస్తామన్నారు..

‘చంద్రయాన్‌-3’ విజయవంతం తర్వాత సూర్యుడిని పరిశోధించేందుకుగానూ ఇస్రో సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించింది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడం ఈ ఉపగ్రహం లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని అధ్యయనం చేసే ఇస్రో తొలి మిషన్‌ ఇదే. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్‌ పాయింట్‌-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది..

Read Previous

తాడేపల్లిలోని సీఐడి విచారణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Read Next

Nupur Sanon – రవితేజ వల్ల నాకు ఆ ఇబ్బంది తొలగిపోయింది: నుపుర్ సనన్

Leave a Reply

Most Popular