జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపు నిచ్చిన టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
అందరికీ మరిన్ని మేళ్లు జరుగుతాయన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్
తిరుపతి: మనందరికి మంచి చేస్తున్న జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతిని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. తిరుపతి 33 వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ ఎన్ వీ రమణారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరగా, భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సామాన్యులకు మంచి చేయాలని జగనన్న భావిస్తుంటే… దీన్ని చంద్రబాబు ఆయనకు కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్ అన్యాయం, అక్రమం అని అంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఓడించి, బుద్ది చెప్పాలన్నారు. తిరుపతి నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు, ప్రజల సహకారంతో తిరుపతి అన్ని విధాలా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ని గెలిపించుకుని, మరింత అభివృద్ధి సాధిద్దామని పిలుపు నిచ్చారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి, విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అంకిత భావంతో పని చేసే వారందరికీ, వారి సేవలకు తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని భూమన అభినయ్ హామీ ఇచ్చారు.
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి…
ఎన్ వీ రమణారెడ్డి సహా పెద్ద ఎత్తున టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ సాదరంగా వైఎస్సార్ సీపీలోకి స్వాగతించారు. వైఎస్సార్ సీపీలో
శ్రీనివాసులు, రవి కుమార్, బాలాజీ, శ్రీకాంత్, సునీత, జ్యోతి అంజలి, తులసమ్మ, ఝాన్సీ,ఉమా, లక్ష్ని, మహేష్, మహేష్ రెడ్డి, కుమార్, మణి, అనిల్ కుమార్, శేఖర్ రెడ్డి, పవన్, మోహన్ రెడ్డి, కోదండ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్ కే ఇమామ్, దూది శివా రాయల్, సయ్యద్ అహ్మద్ షఫీ ఖాదిరి ఇమ్రాన్ భాష తదితరులు పాల్గొన్నారు.