తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ..
ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు.
కేసుల నుంచి బయటపడటానికి చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని మంత్రి కారుమూరి చెప్పారు. బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు..
చంద్రబాబు అవినీతిని ఎండకడతానన్న పవన్ టిడిపితోనే కుమ్మక్కయ్యారని మంత్రి కారుమూరి అన్నారు. తడాకా చూపిస్తానని చెప్పి బాబు పంచన చేరారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి పవన్‌కు ఏమీ లేదని దుయ్యబట్టారు..