Breaking News :

హ్యాపీ ‘కోడి కత్తి డే’ జ‌గ‌న్.. టీడీపీ సెటైరిక‌ల్ ట్వీట్‌..

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం

తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా

నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌ ఆదేశం

YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..

Amit Shah: బీజేపీనీ ఆశీర్వదించండి.. బీసీని సీఎం చేస్తాం..

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్

Form 7a ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన టిడిపి బృందం

ఛలో విశాఖపట్నం.. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేసిన జగన్ ప్రభుత్వం..

విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పుట్టినరోజు శుభకాంక్షలు

వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్‌ ప్రసంగిస్తారు: సజ్జల

ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

సినీ హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

12 గంటల్లో 10 వేల డాలర్లు పెరిగిన బిట్ కాయిన్ ధర

అమెరికా ఉపాధ్యక్షుడు మన ఆంధ్రా..అల్లుడే..!

అమిత్ షా గారితో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

గాజా ఆర్థిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు! ఐక్యరాజ్య సమితి నివేదిక

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..

ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చు-ఎలాన్ మస్క్

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ’

మోదీ పేరు ఏకగ్రీవం..రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు

December 23, 2024

అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. అక్టోబర్‌ 8-10 మధ్య షెడ్యూల్‌ ప్రకటన?

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి..

ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో పోలింగ్‌ నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలి వారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు పేర్కొన్నాయి. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో వివిధ తేదీల్లో ముగుస్తాయి..

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వ్యూహాన్ని ఖరారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నేడు దిల్లీలో ఎన్నికల పరిశీలకులతో భేటీ జరపనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. ఇందుకోసం పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో శుక్రవారం మొత్తం సమీక్ష జరిపి.. తుది ప్రణాళికకు ఆమోదం తెలపనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపిన విషయం తెలిసిందే..

Read Previous

ఏసీబీ వలలో బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌

Read Next

దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Leave a Reply

Most Popular