హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించింది..
పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5 ఉదయానికల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
కోర్టులో కేసు పెండింగ్ అంశాల నేపథ్యంలో పీటీవోలో 100 డ్రైవర్ పోస్టులు, డీఆర్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగంలో నోటిఫై చేసిన 225 ఖాళీలకు సంబంధించి ఎంపికైన వారి వివరాలను వేరేగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల పూర్తి ఫలితాలు, కటాఫ్ మార్కులు (ఎంపికైన తుది అభ్యర్థుల మార్కులు, పుట్టినతేదీ వివరాలతో) గురువారం ఉదయానికల్లా అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది..